జవహర్ నగర్ డంప్ యార్డ్ను తరలించండి.. సీఎం రేవంత్ కు వినతి పత్రం 

జవహర్ నగర్ డంప్ యార్డ్ను తరలించండి.. సీఎం రేవంత్ కు వినతి పత్రం 

జూబ్లీహిల్స్​లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ జేఏసీ నాయకులు కలిశారు. డంప్ యార్డ్ వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వెంటనే తరలించాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, జేఏసీ కన్వీనర్ శంకర్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.
‌‌‌‌‌‌‌‌‌‌‌‌-